
పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి
జనగామ: జనగామ పురపాలిక పన్నుల వసూళ్లలో మరింత వేగం పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రత్యేక అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి పన్నుల వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాల సేకరణ, ఎల్‌ఆర్‌ఎస్, భవన నిర్మాణ అనుమతులు తదితర అంశాలపై సమీక్షించారు. మార్చి 31వ తేదీలోగా రూ.6.50 కోట్ల పన్నులకు గాను రూ.5 కోట్లు వసూలు (85శాతం) చేయాలన్నారు. పన్నుల వసూళ్లలో ప్రతిభ కనబర్చిన వారికి ఉత్తమ అధికారి అవార్డు అందించనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో మున్సిపల్ మేనేజర్ రాములు, ఏఈ మహిపాల్, వార్డ్ ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
జనగామ రూరల్: పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చేపట్టిన పనులపై సంబంధిత విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుంచి వీసీ ద్వారా సమీక్షించారు. పూర్తయిన పనులను ఎంబీ రికార్డ్ చేసి వెంటనే నివేదిక అందించాలన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి రమేశ్, శ్రీనివాస్, శ్రీధర్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఇష్టంతో చదవాలి
నర్మెట: విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మండలకేంద్రంలోని వినాయక గార్డెన్స్‌లో మంగళవారం డీఈఓ రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెన్త్ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమయానికి నిద్ర, మంచి ఆహారం, తగినంత నీరు తీసుకోవడం వంటి ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే విద్యపై ఆసక్తి కలుగుతుందన్నారు. ఓరియంటేషన్ కార్యక్రమాలు విద్యార్థుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష కిట్స్‌ను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కలకుంట్ల వెంకట రామానుజా చార్యులు, ఎంఈఓ మడిపెల్లి ఐల య్య, ఏఎంఓ శ్రీనివాస్, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు వే ణు, గోపాల్‌రెడ్డి, కమల, ఎస్సార్పీలు వాసుదేవ రెడ్డి, శామ్యూల్ ఆనంద్, త్రిపురారి పద్మ, వజ్రయ్య, నరసింహ మూర్తి, పవన్ శ్రవణ్‌కుమార్, సీఆర్పీలు దయాకర్, రవీందర్, సంపత్ పాల్గొన్నారు.
రహదారులపై
చెత్త వేస్తే జరిమానా విధించాలి
మున్సిపల్ సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా

పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి
Comments
Please login to add a commentAdd a comment