ప్రభుత్వ వైద్యం ఎలా ఉంది?
జనగామ: సర్కారు వైద్యం ఎలా ఉంది.. డాక్టర్లు చూస్తున్నారా.. సేవలు బాగున్నాయా..? అంటూ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆరా తీశా రు. జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదరం క్యాంపును పరిశీలించిన తర్వాత కలెక్టర్ నేరుగా జనరల్ వార్డులతోపాటు ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించిన సేవలు ఎలా అందుతున్నాయో డాక్టర్ అనురాధతో కలిసి ప్రత్యక్ష్యంగా పరిశీలించారు. చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన చిన్నారి శంకరపల్లి రన్విత ఆరోగ్య పరిస్థితిపై కలెక్టర్ ఆరా తీశారు. పాపకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మహిళ, పురుష వార్డులను తనిఖీ చేసిన కలెక్టర్.. ఎలా ఉన్నారు.. ఎక్కడినుంచి వచ్చారు, డాక్టర్లు రోజులో ఎన్నిసార్లు వస్తున్నారు, టిఫిన్, భోజనం ఇస్తున్నారా.. అని చికిత్స పొందుతున్న వారి ని అడిగి తెలుసుకున్నారు. పెంబర్తి గ్రామానికి చెందిన వెంకటమ్మ, నర్మెట మండలం వెల్దండకు చెందిన నాగమ్మ సర్కారు వైద్యం బాగుందని స్పందించారు. కంటి వైద్య విభాగాన్ని సందర్శించి, సిటీ స్కాన్, లిఫ్ట్ ఏర్పాట్ల పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆస్పత్రిలో శానిటైజేషన్ నిర్వహణ, పరిశుభ్రత పాటించాలని సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలన్నారు. డాక్టర్లు కేశవనాథ్, అశోక్, సజన్ కుమార్, సిబ్బంది, ఖాజా పాష ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment