ముగిసిన ‘బడిబయటి పిల్లల’ సర్వే
జనగామ రూరల్: జిల్లాలో ఐదేళ్లు నిండిన బాల బాలికలందరినీ పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యంతో గత నెల 10 నుంచి ప్రారంభించిన ‘బడిబయటి పిల్లల సర్వే’ ముగిసింది. క్షేత్రస్థాయిలో ప్రతి మండలంలో క్లస్టర్ వారీగా ఆవాస ప్రాంతంల్లోని ఇంటింటికి వెళ్లి విద్యాశాఖ సీఆర్పీలు సర్వే నిర్వహించారు. మొత్తం 210 మంది పిల్లలను అధికారులు గుర్తించా రు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, గ్రామ పెద్దల సహాయంలో ఉమ్మడిగా సమావేశం నిర్వహించి విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ సిద్ధం చేసుకున్నారు. 33 కాలమ్స్ ఉన్న సర్వే పత్రంలో వారి వివరాలు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. గత ఏడాది బడిబయట ఉన్న 263 మంది పిల్లలను గుర్తించగా.. ఈ ఏడాది 210 మందిని గుర్తించారు.
బడిలో చేర్పించడమే లక్ష్యం..
గ్రామ స్థాయి అధికారులు, ఉపాధ్యాయుల సమన్వయంతో సర్వే విజయవంతం చేశాం. విద్యాహక్కు చట్టం ప్రకారం బడి వయసు పిల్లలందరూ పాఠశాలల్లో చేరాలి. అందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. ప్రతీ ఆవాస ప్రాంతాన్ని పరిశీలించి బడికి వెళ్లని, డ్రాప్‌ఔట్ అయిన పిల్లలందరినీ బడిలో చేర్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం.
– రమేశ్, డీఈఓ
జిల్లాలో గత ఏడాది, ఈ ఏడాది బడిబయటి పిల్లలను గుర్తించిన వివరాలు మండలాల వారీగా..
మండలం గత ఏడాది ఈ ఏడాది
బచ్చన్నపేట 22 26
చిల్పూర్ 26 8
దేవరుప్పుల 10 16
స్టేషన్‌ఘన్‌పూర్ 22 33
జనగామ 20 36
కొడకండ్ల 8 8
లింగాలఘణపురం 28 9
నర్మెట 37 19
పాలకుర్తి 25 28
రఘునాథపల్లి 43 8
తరిగొప్పుల 6 2
జఫర్‌గఢ్ 16 17
మొత్తం 263 210
జిల్లాలో 210 మంది గుర్తింపు
ముగిసిన ‘బడిబయటి పిల్లల’ సర్వే
Comments
Please login to add a commentAdd a comment