పదిహేనేళ్ల నిరీక్షణకు తెర
జనగామ: పదిహేనేళ్ల ఎదురుచూపులకు మోక్షం లభించింది. సర్కారు కొలువు కోసం చేసిన పోరా టం పట్టాలెక్కగా.. కోర్టు తీర్పు మేరకు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టనున్నారు. కొందరిలో సంతోషం.. మరికొందరిలో నిరాశ. 2008లో డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు, 2010లో నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌కు హాజ రయ్యారు. ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడంతో డీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ మధ్యలోనే ఆపేశారు. దీంతో ఉపాధ్యాయ కొలువు వస్తుందని ఆశగా చూసిన వేలాది మంది అభ్యర్థులకు నిరాశనే మిగిలింది. న్యాయం కోసం 15 ఏళ్లుగా పోరాటం చేస్తున్న అభ్యర్థులకు కోర్టు తీర్పుకు లోబడి ప్రభుత్వం తీపి కబురు అందించింది.
డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్..
2008 డీఎస్సీ నష్టపోయిన జిల్లాకు చెందిన 33 మంది అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) ఉపాధ్యాయులుగా బాధ్యతలను తీసుకోనున్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ నెల 17వ తేదీలోగా ఉద్యోగ నియామకం చేపట్టాలని ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. 33 మంది అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ నేతృత్వంలో కబురు పంపించగా... శనివారం ఒరిజినల్ సర్టిఫికెట్లతో డీఈఓ కార్యాలయానికి హాజరయ్యారు. అ భ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం కలెక్ట ర్ ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ ప్రారంభించారు. జి ల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల పరి ధిలోని ఖాళీ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి న వివరాలను అందుబాటులో ఉంచారు. ఇందులో బచ్చన్నపేట–2, చిల్పూరు–2, దేవరుప్పుల–4, స్టే షన్ ఘన్‌పూర్–1, జనగామ–1, కొడకండ్ల–4, లింగాలఘణపురం–1, నర్మెట–2, పాలకుర్తి–7, రఘునాథపల్లి–5, తరిగొప్పుల–3 జఫర్‌గఢ్–1లో ఖాళీ ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు కౌన్సెలింగ్‌లో చూ పించారు. అభ్యర్థుల మెరిట్ ప్రకారం వారు కోరుకు న్న చోట పోస్టింగ్ ఇస్తూ ఆర్డర్ కాపీ ఇష్యూ చేశారు. ఆర్డర్ కాపీ తీసుకునే కాంట్రాక్టు ఉపాధ్యాయులు, ఎంఈఓకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
కాంట్రాక్టు పద్ధతిలో...
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అనుసరిస్తూ 2008 డీఎస్సీ బాధితులకు ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. నెలవారి వేతనం రూ.31,040గా నిర్ణయించింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ముగింపు చివరి దశ (ఏప్రిల్ 23వ తేదీ) వరకు పని చేసి, తిరిగి జూన్ 12 నుంచి కొత్త బాండ్ పేపర్‌తో మళ్లీ విధుల్లో చేరతారు. ఏసీ జీఈ రవికుమార్, యాదగిరి, మళ్లిఖార్జున్, శ్రీధర్, నూరొద్దీన్, మెరుగు రామరాజు, కిరణ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించగా, పలు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగాలు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. కౌన్సెలింగ్ పూర్తి
జిల్లాలో 33 మందికి పోస్టింగ్
ఈ నెల 17న విధుల్లోకి...
సంతోషంగా ఉంది..
2008లో డీఎస్సీ అర్హత సాధించి, 2010లో రిక్రూట్‌మెంట్ కోసం నియామక పత్రం తీసుకునే సమయంలో కోర్టు స్టేతో తమ ఆశలు ఆవిరైపోయాయి. న్యాయంగా తమకు రావాల్సిన ఉద్యోగం కోసం 15 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. కోర్టు తీర్పునకు లోబడి ప్రభుత్వం తమను కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం ఇవ్వడం సంతోషంగా ఉంది.
– గడ్డం కవిత, బీఈడీ, 2008 డీఎస్సీ అభ్యర్థి
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్‌లో పని చేస్తున్న. ఈ నెల 17వ తేదీ నుంచి ఉద్యోగ నియామక బాధ్యతలు తీసుకుని, విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తా. 15 ఏళ్ల పోరాటంలో సుమారు రూ.లక్షకు పైగా ఖర్చు అయింది.
– ఎం.రమేశ్, శివునిపల్లి
పదిహేనేళ్ల నిరీక్షణకు తెర
పదిహేనేళ్ల నిరీక్షణకు తెర
Comments
Please login to add a commentAdd a comment