పట్టణంలో కారు బీభత్సం
● బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలోకి దూసుకు వచ్చిన వాహనం
● ఒకరి పరిస్థితి విషమం.. ఐదుగురికి గాయాలు
● తొమ్మిది వాహనాలు ధ్వంసం
● పోలీసుల అదపులో యువకులు
జనగామ: జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా మారగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. జనగామ చౌరస్తా నుంచి ఏపీ 36 ఏటీ 1179 నంబరు గల కారు సూర్యాపేట రోడ్డువైపు అతివేగంగా వస్తోంది. అందులో నలుగురు యువకులు ఉన్నారు. సడెన్‌గా హ్యాండ్ బ్రేక్ వేయడంతో కారు పక్కనే ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూం వైపు దూసుకు వచ్చింది. అదే సమయంలో రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన కొయ్యడ రాకేష్, కొయ్యడ శ్రావన్, సింగిరెడ్డి సంతోష్‌కుమార్ స్నేహితుడి వివాహ వేడుకలకు గిఫ్టు కొనుగోలు చేసేందుకు షోరూం వద్దకు వచ్చారు. షోరూంలో పనిచేసే లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన మహిళా ఉద్యోగిని కల్పన అదే సమయంలో బయటకు వస్తున్నారు. సెకండ్ల వ్యవధిలో వంద కిలోమీటర్ల వేగంతో వచ్చిన కారు షోరూం ముందు పార్క్ చేసిన తొమ్మిది బైక్‌లను ఢీ కొడుతూ కల్పనను లాక్కుపోయింది. ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లు విరిగి పోయి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు చెందిన మరో మహిళ పేరువుల మేరితో పాటు ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించి.. కారు ప్రమాదానికి కారకులైన నలుగురు యువకులను పోలీసులకు అప్పగించారు. కారు ఎన్పీడీసీఎల్ ఉద్యోగికి చెందినదిగా భాస్తుండగా.. అందులో ఉన్న కొంతమంది మద్యం సేవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పనతో పాటు నలుగురికి జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి వరంగల్‌కు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పట్టణంలో కారు బీభత్సం
పట్టణంలో కారు బీభత్సం
Comments
Please login to add a commentAdd a comment