పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి
జనగామ రూరల్: ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని సీఎస్ శాంతికుమారి అన్నారు. మంగళవారం హైదారాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్‌లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్‌లతో కలిసి వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, రైతు భరోసాపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి పరిధిలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదును పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. యాసంగి సాగు నీటి సరఫరా గురించి ఆన్, ఆఫ్ విధానంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డీఏఓ రామారావు నాయక్, డీఎం సీఎస్ హతిరాం, మిషన్ భగీరథ ఈఈ శ్రీకాంత్, విద్యుత్ ఎస్‌ఈ వేణుమాధవ్, అధికారులు పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట వ్యతిరేకం
లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట వ్యతిరేకమని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో, బేటీ పడావో పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ – 1994పై ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆశలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి 3 సంవత్సరాల జైలు, రూ. 10,000 జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ప్రతీ ఆస్పత్రిలో, స్కానింగ్ సెంటర్లలో ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ఫ్లోరె న్స్, డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్ రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీదేవి, మహిళా సాధికారత కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్ హెచ్. శారద, ప్రోగ్రామింగ్ అధికారి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
‘రైతు భరోసా’కు గ్రీవెన్స్ సెల్
ఏర్పాటు చేయాలి
చివరి ఆయకట్టు వరకు
సాగునీరు అందించాలి
వీసీలో సీఎస్ శాంతికుమారి
Comments
Please login to add a commentAdd a comment