పోలింగ్ @ 94.31 %
జనగామ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉండగా 10,401 మంది ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తంగా 92.95 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే జనగామ జిల్లాలో ఎన్నికలను కలెక్టర్, ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా పర్యవేక్షించారు. 1,002 మంది ఓటర్లకు గాను 945 మంది ఓటు హక్కు వినియోగించుకు న్నారు. పోలింగ్ తరిగొప్పుల, జఫర్‌గఢ్‌లో నూరు శాతం కాగా.. అత్యల్పంగా బచ్చన్నపేటలో 87.14 శాతం నమోదైంది. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీసీపీ రాజమహేంద్రనాయక్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు చేపట్టారు. జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్ ఏరియా ప్రభుత్వ బాలికల జూని యర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 511 ఓట్లు ఉండడంతో టీఎస్‌యూటీఎఫ్, పీఆర్‌టీయూ, తపస్, బీసీటీఏ, టీపీటీఎఫ్ నాయకులతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్, మాజీ అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, రాష్ట్ర నాయకులు కేవీఎల్‌ఎన్.రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశా ల పోలింగ్ స్టేషన్‌తో పాటు లింగాలఘణపురం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల సెంటర్‌లో పోలింగ్ సరళిని కలెక్టర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న ఆధ్వర్యాన తహసీల్దార్లు, ఇతర ఉన్నతాధికారులు పోలింగ్ తీరును గమనించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎస్కార్ట్‌ల సహాయంతో ఓటింగ్ బాక్స్‌లను నల్లగొండకు తలరించారు.
ఉమ్మడి జిల్లాలో జిల్లాల వారీగా
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు..
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
జిల్లాలో రెండు చోట్ల వందశాతం..
బచ్చన్నపేటలో అత్యల్పం
ఓటింగ్‌కు దూరంగా 57 మంది
కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
జిల్లా ఓటర్లు పోలైనవి శాతం
జనగామ 1,002 945 94.31
హనుమకొండ 5,215 4,780 91.66
వరంగల్ 2,352 2,214 94.13
మహబూబాబాద్ 1,663 1,571 94.47
భూపాలపల్లి 329 308 93.62
ములుగు 628 583 92.83
– మరిన్ని ఫొటోలు 9లోu
పోలింగ్ @ 94.31 %
పోలింగ్ @ 94.31 %
Comments
Please login to add a commentAdd a comment