కోర్కెలు తీర్చే కల్పవల్లి..
కాజీపేట రూరల్: కాజీపేట ఫాతిమానగర్‌లోని ఫాతిమామాత ప్రజల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. చరిత్రకలిగిన ఫాతిమామాత దేవా లయం కేథడ్రల్ చర్చి ప్రాంగణం ఓరుగల్లు మేత్రాసనంలో ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రతి ఏటా మూడు రోజులపాటు నిర్వహించే ఫాతిమామాత మహోత్సవానికి వివిధ జిల్లాల నుంచి విశ్వాసులు, అన్ని వర్గాల ప్రజలు తరలివస్తుంటారు. ఈ ఏడాది ఓరుగల్లు పీఠంలో 2025 సాధారణ జూబిలీ సంవత్సరంలో బిషప్ డాక్టర్ ఉడుములబాల ఆశీర్వాద వేళలో మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు బిషప్ సెక్రటరీ ఫాదర్ గంగారపు అనుకిరణ్ సోమవారం తెలి పారు. కాజీపేట మెయిన్‌రోడ్‌లో చర్చి ఎంట్రెన్స్ వద్ద నిర్మించిన మహాతోరణం ఆశీర్వాద ద్వారం, ప్రాంగణంలో జపమాల బృందావనం (రోజరి గార్డెన్)ను బిషప్ ఉడుముల బాల ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకొని కేథడ్రల్ చర్చి, ఫాతిమామాత గుహను ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవాలకు 12 జిల్లాల నుంచి 10 వేల మంది భక్తులు రానున్నట్లు తెలిపారు.
మూడు రోజుల కార్యక్రమాలు..
కేథడ్రల్ చర్చిలో ఈ నెల 11వ తేదీన మంగళవారం మహాపూజ్య డాక్టర్ ఉడుములబాల దివ్యబలిపూజ సమర్పణ, దంపతులకు సన్మానం, 12వ తేదీ బుధవారం ఫాదర్ తాటికొండ జోసెఫ్, డి.జోసెఫ్ ఆధ్వర్యంలో స్వస్థత ప్రార్థనలు, దివ్యబలిపూజ, కర్కూల్ పీఠం పూజ్య ఏరువ జోజిరెడ్డిచే పూజ ప్రార్థనలు. సాయంత్రం ఫాతిమామాత స్వరూపంతో ఊరేగింపు, ఫాతిమా మాత ప్రధాన ద్వారం, రోజరి గార్డెన్ ప్రారంభం, కొవ్వత్తులతో దివ్వప్రసాద ప్రదక్షిణ ది వ్యప్రసాద ఆశీర్వాదం. 13వ తేదీన గురువారం బెంగళూర్ అగ్రపీఠం మెన్సిగ్నోర్ సి.ప్రాన్సీస్ ఆంగ్లంలో దివ్యబలిపూజ కార్యక్రమం చేయనున్నారు. ఓరుగల్లు పీఠకాపరి అండ్ విశాఖ అగ్రపీఠకాపరి ఉడుములబాల సమష్టి కృతజ్ఞత సమర్పణ. సాయంత్రం 5:30 గంటలకు మూడో పూజ, గురుశ్రీ ఆశీ ర్వాదం, ఎస్.జె దివ్యపూజ పతాక అవరోహణతో పాతిమామాత ఉత్సవాల ముగింపు.
పోస్టర్ ఆవిష్కరణ
కాజీపేట: మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఫాతిమామాత ఉత్సవాలను విజ యవంతం చేయాలని బిషప్ ఉడుముల బాల కోరారు. ఈమేరకు కాజీపేట మీడియా పాయింట్ ఆవరణలో స్థానిక కెథడ్రల్ చర్చి విచారణ గురువు ఫాదర్ కాసు మర్రెడ్డి ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. అనుకిరణ్, బొక్క దయాసాగర్, తాటికొండ జోసఫ్, సురేష్, నవీన్ ఫాదర్ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఫాతిమామాత మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ముఖ్య అతిథిగా ఓరుగల్లు పీఠకాపరి ఉడుములబాల
నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం
కోర్కెలు తీర్చే కల్పవల్లి..
Comments
Please login to add a commentAdd a comment