ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి
జనగామ: విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల తీరును మంగళవారం ప ర్యవేక్షించారు. పరీక్షకు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, మెడికల్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబి రంలో మందులను తనిఖీ చేశారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలని, జవాబు పత్రాలను వెంటనే పోలీసు బందోబస్తు మధ్య నిర్దేఽశిత ప్రాంతాలకు తరలించా లని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment