రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
జనగామ: ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం అందిస్తున్న 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. మంగళవారం జనగామ మున్సిపల్ కార్యాలయంలో చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారుల ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఏసీ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీపీఓ స్వరూప, డీఏఓ రామారావు నాయక్ తదితరులు ఉన్నారు.
బచ్చన్నపేటలో..
బచ్చన్నపేట: రాయితీని వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పలువురు లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి పాట్లను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న వారి జాబితా ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శుల వద్ద ఉంటుందని, ఈ నెల 31లోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి, జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, ఎంపీడీఓ వెంకట మల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి నర్సింహచారి, తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment