జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి
స్టేషన్‌ఘన్‌పూర్: బహుజన పోరాట వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరును జిల్లాకు పెట్టాలని తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని తాటికొండ గ్రామంలో బహుజన ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21న కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ఒక్కరోజు దీక్షకు బహుజనులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సానాది రాజు, బహుజన సంఘం అధ్యక్షుడు అక్కనపెల్లి వెంకటయ్య, ఉబ్బని భిక్షపతి, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి ఐలోని సుధాకర్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
19 కిలోల
ఎండుగంజాయి పట్టివేత
నర్మెట: మండలంలోని హన్మంతాపురం–బొమ్మకూరు క్రాస్ రోడ్డు వద్ద 19 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఇచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ ముసుగు అబ్బయ్య, ఎస్సై నగేష్ తమ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బొమ్మకూర్ క్రాస్ రోడ్డు వద్ద బ్యాగ్‌తో ఉన్న అనుమానిత వ్యక్తిని తనిఖీ చేయగా రూ. 10 లక్షల విలువ చేసే 19 కిలోల ఎండుగంజాయి పట్టుబడింది. జార్ఖండ్ రాష్ట్రం కొడెర్మా జిల్లా జుంరి తేలాయియాకు చెందిన ఎండీ మోక్తార్ వర్శి ఒరిస్సా రాష్ట్రంలో కొనుగోలు చేసిన గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రైన్‌లో పోలీసులు తారస పడటంతో జనగామ స్టేషన్‌లో దిగి ఆటోలో హన్మంతాపురం చేరుకున్నాడు. అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నీరులేక ఎండుతున్న
పంటలు
బచ్చన్నపేట: మండలంలోని పలు గ్రామాల్లో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. మంగళవారం మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని తమ్మడపల్లి, చిన్నరామన్‌చర్ల గ్రామాల్లో పర్యటించి ఎండిన పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో అన్నదాతలు వరి పంటను రైతులు సాగు చేశారని వీటికి ప్రధాన జీవనాధారం బోరు బావులేనన్నారు. వెంటనే గోదావరి జలాలతో చెరువులు, కుంటలను నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉడుగుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, నాయకులు మైపాల్, నవీన్, రైతులు పాల్గొన్నారు.
జనగామ రూరల్: పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు లద్దునూరి మహేశ్ యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని ఓబుల్‌కేశవపూర్, పెద్దరామన్‌చర్ల గ్రామాల్లో నీరందక ఎండిన పంటలను పార్టీ బృందంతో కలిసి క్షేత్ర స్థాయిలో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉడుగుల రమేష్, మార్క ఉపేందర్, దేవరాయి ఎల్లయ్య, సిరికొండ విజయ్ భాస్కర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి
జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి
Comments
Please login to add a commentAdd a comment