పసిపాప దొరికింది..
జనగామ: కుటుంబంలో ఒక్కరిగా నమ్మించి పది నెలల పాపను ఎత్తుకెళ్లిన నిందితులు జనగామ పోలీసులకు పట్టుబడ్డారు. పదిహేను రోజుల తర్వా త బిడ్డను చూసిన తల్లి.. ఒడిలోకి తీసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ మేరకు మంగళవా రం జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ పండేరి చేతన్ నితిన్.. సీఐ దామోదర్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్ల డించారు. జనగామ జిల్లా కేంద్రం కళ్లెం రోడ్డులో పీఎల్‌జీ కన్వెన్షన్ నిర్మాణ పనుల కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి రాంజుల్ రజాక్ కుటుంబంతో పాటు మరి కొంత మంది కూలీలు వచ్చారు. అక్కడే నివాసం ఏర్పరుచుకుని పనులు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా అల్లీపురం కొత్తగూడెంకు చెందిన పతంగి సురేశ్, ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నియోజకవర్గం కోనూరుకు చెందిన తన రెండో భార్య తిరుపతమ్మ విజయవాడలో భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ సమయంలో వీరికి విజయవాడకు చెందిన చంద్రమ్మ పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల పాటు అక్కడే కూలీ పనులు చేసుకుంటూ లక్షలు సంపాదించాలనే దురాశతో పిల్లల కిడ్నాప్‌నకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో చంద్రమ్మ ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన గరిక ముక్కు విజయలక్ష్మిని రంగంలోకి దింపింది. అనంతరం సురేశ్, తిరుపతమ్మ దంపతులు విజయవాడ నుంచి వరంగల్‌కు లేబర్ అడ్డాకు చేరుకున్నారు. అక్కడ జనగామకు చెందిన మేసీ్త్ర అజయ్‌తో పరిచయం ఏర్పరుచుకుని కళ్లెం రోడ్డులోని పీఎల్‌జీ కన్వెన్షన్‌లో పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికుల గుడారం పక్కనే వీరు నివాసమున్నారు. ఈ క్రమంలో రాంజుల్ రజాక్ పది నెలల పాప(బిడ్డ) శివానీని వారు సొంత బిడ్డలా చూసుకున్నారు. దీంతో రాంజుల్ కుటుంబం సైతం వారిని నమ్మారు.
పథకం ప్రకారమే..
గత నెల 25వ తేదీన పథకం ప్రకారం మేస్త్రీ అజయ్ బైక్‌పై మార్కెట్‌కు వెళ్తున్నామని చెప్పి పాప శివానీని ఎత్తుకెళ్లారు. వారు ఎంతకూ రాకపోవడంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీపీ పండేరి చేతన్ నితిన్ పర్యవేక్షణలో సీఐ దామోర్‌రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు ఆధ్వర్యంలో సీసీ ఫుటేజీ పరిశీలనతోపాటు గాలింపు ముమ్మరం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్–హైదరాబాద్ హైవే పెంబర్తి క్రాస్ వద్ద తనిఖీ చేసే క్రమంలో బైక్‌పై వస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నారు. దీంతో పాప శివానీ తీసుకుని ముగ్గురు నిందితులు సురేశ్, తిరుపతమ్మ, గరికముక్కు విజయలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. చంద్రమ్మ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
15 రోజుల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..
పెంబర్తి క్రాస్ వద్ద పట్టుబడిన నిందితులు
ముగ్గురి అరెస్ట్, రిమాండ్
వివరాలు వెల్లడించిన ఏసీపీ పండేరి చేతన్ నితిన్
Comments
Please login to add a commentAdd a comment