కంపు కంపు!
విధులు బహిష్కరించిన కేఎంసీ హాస్టళ్ల కార్మికులు
ఎంజీఎం : ప్రభుత్వ నిర్లక్ష్యం.. వేతనాల కోసం కార్మికులు చేపట్టిన ఆందోళనతో కాకతీయ మెడికల్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న మెడికల్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత కీర్తి ప్రతిష్టలు పొందిన కేఎంసీ అధ్యాపకుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో కనీసం మౌలిక వసతులు కల్పించడంలో సైతం ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వైద్యవిద్యపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మెడికల్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టళ్లలో పనిచేసే కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు విధులు బహిష్కరించి ఆందోళన చేపడుతున్నారు. 80 మందికి పైగా కార్మికులు ఆందోళన బాట పట్టడంతో హాస్టళ్లలో శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా మారిది.
ఇబ్బందులు పడుతున్న 1,250 మంది విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment