బ్రహ్మోత్సవాలు ప్రారంభం
చిల్పూరు: చిల్పూరుగుట్ట శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి 8.30 గంటలకు తొలక్కం కార్యక్రమంతో ప్రారంభం అయ్యాయి. ఆలయ అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచా ర్యుల వేద మంత్రాల నడుమ చేపట్టిన ఈ వేడుకలకు అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ హాజ రయ్యారు. ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు–కిరణ్మయి, తహసీల్దార్ సరస్వతి, జూనియర్ అసిస్టెంట్ మోహన్, వీరన్న, ధర్మకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్ ఎత్తివేత
జనగామ: వరంగల్–ఖమ్మం–నల్గొండ ఉమ్మ డి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితా లు వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తి వేసినట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా గురువా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో జనవరి 29 నుంచి అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
సాగునీరు విడుదల చేయాలి
జనగామ: జనగామ నియోజకవర్గంలో యాసంగి సీజన్‌లో సాగు చేసిన పంటలను కాపాడేందు కు రిజర్వాయర్ల ద్వారా సాగునీరు విడుదల చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్‌రెడ్డిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపు రి కిరణ్‌కుమార్‌గౌడ్ కోరారు. ఈ మేరకు గురువారం వారు హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో ఆయకట్టు స్థిరీకరణ, నీటి విడుదల సమయంలో జాప్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవా లని కోరినట్లు వారు పేర్కొన్నారు.
పంపింగ్‌లో నిర్లక్ష్యం వద్దు
నర్మెట: రిజర్వాయర్లలోని నీరు ఎగువ ప్రాంతాలకు సకాలంలో పంపింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలి.. నిర్లక్ష్యం చేయొద్దని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్ అన్నారు. మండలంలోని బొమ్మకూర్, గండిరామారం పంప్ హౌస్‌లను ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించా రు. వాటి పరిధిలోని విద్యుత్ సబ్‌స్టేషన్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. విధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అంబులెన్స్‌ల తనిఖీ
జనగామ: జిల్లాలోని 108, 102, 1962 అంబు లెన్స్ వాహనాలను జీవీకే ఈఎంఆర్‌ఐ హెడ్ సత్యనారాయణ గురువారం ఆకస్మికంగా తని ఖీ చేశారు. అంబులెన్స్‌ల్లో టెక్నాలజీ విని యోగం, మెడికల్ పరికరాల పనితీరు, మందు ల స్టాక్, కాలపరిమితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్‌కాల్ వచ్చిన వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలని చెప్పారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేలా అంకితభావంతో పని చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వేసవిలో అందించాల్సిన సేవలు, తీసుకోవా ల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో నల్గొండ ఉమ్మడి ప్రోగ్రాం మేనేజర్ నసీరుద్దీన్, జనగామ జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment