శుభ ముహూర్తాలకు బ్రేక్
జనగామ: జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభమైన శుభ ముహూర్తాలకు బ్రేక్ పడింది. నెలన్నరగా శుభకార్యాలు, వివాహాలు, గృహ ప్రవేశాలతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. గురువారం చివరి మూహూర్తం నేపథ్యంలో ఒకేరోజు వందలా ది వివాహాలు జరిగాయి. ఒక్క జిల్లా కేంద్రంలోనే 50 మంది వధూవరులు మూడుముళ్ల బంధం, ఏడడుగులతో ఒక్కటయ్యారు. ఉగాది పండుగ నుంచి తిరిగి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి.
ఆర్టీసీకి కాసుల వర్షం..
శుభ ముహూర్తం చివరి రోజు వివాహాలు వేల సంఖ్యలో ఉండడంతో ఆయా ప్రాంతాలకు ప్రయాణించే వారితో ఆర్టీసీ జనగామ డిపోకు టికెట్ కలెక్షన్లు పెరిగాయి. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు బస్‌స్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. ఒక్కో బస్సులో 80 నుంచి 90 మంది ప్రయాణించారు. సీట్ల కోసం పోటీపడ్డారు. పిల్లలు, వృద్ధులు, మహిళలకు ఇబ్బందులు తప్పలేదు.
ఒకేరోజు వందల వివాహాలు
ఆర్టీసీకి కలెక్షన్లు ఫుల్
Comments
Please login to add a commentAdd a comment