సాధారణ ప్రసవాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

సాధారణ ప్రసవాలు పెంచాలి

Published Thu, Mar 27 2025 1:19 AM | Last Updated on Thu, Mar 27 2025 1:18 AM

జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు

పాలకుర్తి టౌన్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచి మాతా శిశు మరణాలు తగ్గించేలా వైద్య సిబ్బంది పనిచేయాలని జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత శ్రేణి ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం మా ట్లాడుతూ వేసవిలో ఎండ దెబ్బకు గురికాకుండా ప్రతీ సెంటర్‌లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవా లన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా ప్రజలందరికీ వైద్య సేవలు అందేలా పనిచేయాలని చెప్పారు. ఆర్యోగ సిబ్బంది ఇచ్చిన వ్యక్తిగత టార్గెట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. డాక్టర్‌ సిద్ధార్థ్ధరెడ్డి, సంధ్య, ఉష, ప్రభాకర్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఐదుగురు విద్యార్థుల గైర్హాజరు

జనగామ రూరల్‌: జిల్లాలో బుధవారం నిర్వమించిన పదో తరగతి గణితం పరీక్షకు ఐదుగురు విద్యార్థులు గైర్హాజర్‌ అయ్యారని డీఈఓ రమేశ్‌ తెలిపారు. మొత్తం 6,238 మంది విద్యార్థులకు 6,233 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. జఫర్‌గఢ్‌, పాలకుర్తి సెంటర్లను రాష్ట్ర పరిశీలకులు ఎస్‌.శ్రీనివాసాచారి, జనగా మలో పరీక్షల విభాగం అధికారి టి.రవికుమా ర్‌ పరిశీలించారు.

అంగడి వేలం రూ.8లక్షలు

బచ్చన్నపేట: మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించే వారాంతపు సంత వేలం పాట పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికా రి, డీఏఓ రామారావు, ఎంపీడీఓ వెంకట మల్లికార్జున్‌ ఆధ్వర్యాన కార్యదర్శి నర్సింహా చారి బుధవారం నిర్వహించారు. వేలంలో 20 మంది పాల్గొనగా పశువుల సంతను మంచా ల వినయ్‌ రూ.5.18 లక్షలకు, తైబజార్‌ను దేవిని నాగేష్‌ రూ.2.55 లక్షలకు, డెక్కను (నాడెలు) మంచాల వివేక్‌ రూ.27వేలకు దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ పూర్ణచందర్‌ పాల్గొన్నారు.

యునిక్‌ ఐడీ క్యాంపు

జనగామ రూరల్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ప్రభుత్వ ఆస్పత్రి ఆధ్వర్యాన బుధవారం దివ్యాంగులకు సదరం క్యాంపునకు బదులు యునిక్‌ ఐడీ క్యాంపు నిర్వహించారు. దివ్యాంగులతోపాటు దృష్టిలోపం ఉన్నవారు హాజరయ్యారని, నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించి డిజబులిటీ కార్డులు అందజేస్తామని అసుపత్రి సూపరెంటెండెంట్‌ గోపాల్‌రావు తెలిపారు. కార్యక్రమంలో డాక్లర్లు ప్రొఫెసర్‌ పద్మ, ఈవీ రాజు, డాక్టర్‌ సృజన్‌కుమార్‌, డీపీఎం వినీత, ఏపీఎం సురేందర్‌, రమేశ్‌, భవానీ తదితరులు పాల్గొన్నారు.

రూ.4.89 లక్షల విలువైన గుట్కాల పట్టివేత

జనగామ: జిల్లా కేంద్రం కురుమవాడలో గుట్కాలు అక్రమంగా నిల్వ చేశారనే విశ్వసనీ య సమాచారం మేరకు టాస్క్ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌ ఆధ్వర్యాన బుధవారం దాడులు చేపట్టారు. రూ.4,89,650 విలువైన గుట్కాలను పట్టుకుని విక్రయిస్తున్న రాజస్థా న్‌కు చెందిన వ్యాపారి మల్‌రామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన మరో వ్యాపారి గామ్నారాం పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. గుట్కాలను జనగామ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నేటినుంచి మూల్యాంకనం

విద్యారణ్యపురి: ఈనెల 28 నుంచి నిర్వహించాల్సిన ఇంటర్‌ బాటనీ, జువాలజీ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని గురువారం(నేడు) నుంచి చేపడుతున్నట్లు స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంప్‌ ఆఫీసర్‌, డీఐఈఓ గోపాల్‌ ఒక ప్రకట నలో తెలిపారు. అన్ని కాలేజీ యాజమాన్యాల అధ్యాపకులను రిలీవ్‌ చేసి మూల్యాంకనానికి విధిగా పంపాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.

సాధారణ ప్రసవాలు పెంచాలి1
1/1

సాధారణ ప్రసవాలు పెంచాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement