భూపాలపల్లి అర్బన్: ఈ నెల 26నుంచి మార్చి 7వ తేదీ వరకు జరగనున్న ప్రీ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు చెప్పారు. కక్షిదారులు రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు. రాజీ పడదగిన సివిల్, క్రిమినల్, వాహన ప్రమాద పరిహార కేసులు, చిట్ ఫండ్, వైవాహిక, ఆస్తి తగాద, ట్రాఫిక్ కేసులు పరిష్కరించబడుతాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment