టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు
భూపాలపల్లి: పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహణపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో విద్యా, విద్యుత్, వైద్య, ఆర్టీసీ, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మార్చి 21నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం పరీక్ష సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం కల్పించాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించి కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ రాజేందర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, కలెక్టరేట్ ఏఓ ఖాజా మొహినుద్దీన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధికి సహకరించాలి
భూపాలపల్లి: ఇంటి యజమానులు తమ ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ కోరారు. రెవెన్యూ సిబ్బంది సోమవారం పట్టణంలోని మంజూర్‌నగర్‌లో ఇంటి పన్నులు వసూలు చేయగా కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందశాతం పన్నులు చెల్లించి భూపాలపల్లిని ఆదర్శంగా నిలిపేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూలు 50 శాతం మాత్రమే పూర్తయిందని, వసూలుపై సిబ్బంది దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ టి రమేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వి.భాస్కర్, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.
అధికారులతో
సమన్వయ సమావేశం
భూపాలపల్లి అర్బన్: మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా జడ్జి నారాయణబాబు మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్‌లో పెద్దఎత్తున కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే కలిగే లాభాలను ప్రజ లకు తెలియజేయాలన్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు, ఆర్‌టీసీలో పెండింగ్‌లో ఉన్న ప్రీ లిటిగేషన్ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జయరాంరెడ్డి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రారావు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ రవీందర్ పాల్గొన్నారు.
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment