పకడ్బందీగా ఎన్నికల విధులు
భూపాలపల్లి: ఈ నెల 27న జరుగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్‌లో సోమవారం కాటారం, భూపాలపల్లి డివిజన్ల పీఓ, ఏపీఓలకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ముందురోజే చేరుకుని ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఎలక్షన్ సామగ్రిని పరిశీలించుకొని పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. 26వ తేదీ ఉదయం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సామగ్రి అందజేస్తామన్నారు. 27న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పొరపాట్ల్లకు తావులేకుండా ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. ఏదేని పొరపాటు జరిగితే ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, భూపాలపల్లి ఆర్డీఓ రవి, పీఓ, ఏపీఓలు పాల్గొన్నారు.
పోలింగ్ నేపథ్యంలో సైలెన్స్ పీరియడ్..
పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలింగ్ సందర్భంగా 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా ఉండటం, ప్రచారం చేయడం నిషిద్ధమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపడం కూడా నిషేధమని తెలిపారు. తప్పకుండా ప్రతీ ఒక్కరు ఎన్నికల మార్గదర్శకాలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి బహిరంగ సభలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పరిశీలించనుటన్నలు చెప్పారు.
48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలులో..
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment