భూపాలపల్లి: రూరల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నందకుమార్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిసి పలు పుస్తకాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అటవీ గ్రామాలతో పాటు ఎంపిక ప్రాతిపదికన 19 ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటు, స్పోర్ట్స్ కిట్లను సంస్థ వ్యవస్థాపకుడు పూణేకు చెందిన ప్రదీప్ లోకండే అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి నితీన్‌కుమార్, ఎస్పీ సీసీ ఫసియొద్ధిన్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే