భూపాలపల్లి రూరల్: జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జె.వెంకటేష్, జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా గ్రామాలలో ప్రజా స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించగా.. పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని, తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలన్నారు. పలిమెల, మహాముత్తారం, కాటారం, మహదేవపూర్, మల్హర్ మండల కేంద్రాల్లో ఇళ్లు లేని పేదలకు పట్టాలు అందించా లని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో నాయకులు చెన్నూరి రమేష్, గుర్రం దేవేందర్, వెలిశెట్టి రాజ య్య, ఆత్కూరి శ్రీకాంత్, శేఖర్ పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు వెంకటేష్