చిట్యాల: మండలకేంద్రంలోని బియ్యం గోదాం(ఎంఎల్‌ఎస్ పాయింట్)ను జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ పెరుమాండ్ల రాములు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల బియ్యం గోదాం నుంచి ఆరు మండలాలకు 176 రేషన్ షాపులు ఉన్నాయని, 14,844 టన్నుల బియ్యం సప్లై అవుతున్నాయని తెలిపారు. శుక్రవారం నాటికి 110 రేషన్ షాపులకు బియ్యం సప్లై చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా 66 రేషన్ షాపులకు రెండు రోజులలో సప్లై చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట అసిస్టెంట్ సివిల్ సప్‌లై ఆఫీసర్ (ఏసీఎస్‌ఓ) వేణు, గోదాం ఇన్‌చార్జ్ గంగాధరి రాజు ఉన్నారు.