కాటారం: రాజ్యాంగ పరిరక్షణ, అంబేడ్కర్ ఆశయ సాధన కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. కాటారం మండలకేంద్రంలో శుక్రవారం ‘జై బాపు, జై భీమ్, జై సంవిధన్’ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంగా రాఘవరెడ్డి హాజరై మాట్లాడారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, యూత్ అధ్యక్షుడు చిటూరి మహేశ్, నాయకులు పాల్గొన్నారు.