
జిమ్ చేయలేక.. ఆటలు ఆడుకోక..
విరిగి
నిరుపయోగంగా
మారిన
పరికరాలు
బస్టాండ్ సమీపంలోని ప్రొఫెసర్ జయశంకర్ పార్క్‌ను సింగరేణి యాజమాన్యం 2017 సంవత్సరంలో నిర్మించి మున్సిపల్ శాఖకు అప్పగించింది. దీంతో గార్డెనింగ్, పచ్చదనం బాధ్యత సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్నప్పటికీ జిమ్, చిన్న పిల్లల కోసం ఏర్పాటుచేసిన వివిధ రకాల పరికరాల నిర్వహణ భారం మున్సిపల్ శాఖ చూసుకోవాల్సి ఉంది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జిమ్, ఆటల పరికరాలు పూర్తిగా చెడిపోయాయి. జారుడు బళ్లలు, ఊయ్యాలలు, ఇతర వస్తువులు పూర్తిగా పగిలిపోయి కొన్ని, విరిగిపోయి నిరుపయోగంగా మారాయి. దీంతో సరైన జిమ్, ఆటల పరికరాలు లేకపోవడంతో ఇటు పెద్దలు, అటు చిన్నారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రి వేళలో ఇబ్బందులు పడుతున్నారు. విష పురుగులు తిరుగుతున్నాయి.

జిమ్ చేయలేక.. ఆటలు ఆడుకోక..