
ఆహ్లాదం కరువు..
జిల్లా కేంద్రంలో అధ్వానంగా పార్కులు
జిల్లాకేంద్రంలోని పార్కులు అధ్వానంగా మారాయి. బస్టాండ్ సమీపంలోని ప్రొఫెసర్ జయశంకర్, పట్టణ శివారు ప్రధాన రహదారిపై అటవీశాఖ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ ఎకో పార్క్‌లో సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. పార్కులో ఆట పరికరాలు, ఓపెన్ జిమ్ పరికరాలు విరిగి, పలిగిపోయి మూల పడి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎమ్మెల్యే, కలెక్టర్ సందర్శించి మరమ్మతులు చేయాలని ఆదేశించినా అధికారుల్లో చలన కలగడం లేదు. దీంతో పిల్లలకు పార్కుల్లో ఆటవిడుపు లభించడం లేదు. – భూపాలపల్లి అర్బన్
● ప్రొఫెసర్ జయశంకర్,
ఎకో పార్కులో సౌకర్యాలు కరువు
● పాడైన ఆటల పరికరాలు
● ఏళ్లుగా మరమ్మతుకు నోచుకోని వైనం
● ఎమ్మెల్యే, కలెక్టర్ చెప్పినా
పట్టించుకోని అధికారులు

ఆహ్లాదం కరువు..