
రామప్ప శిల్పాలతో కీ చైన్ల ఆవిష్కరణ
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని నిర్మించి 812సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం రామప్ప గార్డెన్‌లో రామప్ప శిల్పాలతో కూడిన కీ చైన్లను రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు పాండురంగారావు, ఉమ్మడి జిల్లా టూరిజం అధికారి శివాజీ, సేవా టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు కుసుమ సూర్యకిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయుల కళావైభవాన్ని భవిష్యత్ తరా లకు అందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. 812 ఏళ్ల క్రితం నిర్మించినా రామప్ప ఆలయం చెక్కు చెదరకుండా ఉందని, యునెస్కో గుర్తింపుతో ప్రపంచ పటంలో రామప్ప ఆలయానికి గుర్తింపు లభించిందన్నారు.

రామప్ప శిల్పాలతో కీ చైన్ల ఆవిష్కరణ