
లక్ష ఎకరాల సాగు అంచనా..
జిల్లా వ్యాప్తంగా గతేడాది 85,691 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. వచ్చే సీజన్‌లో లక్ష ఎకరాలకు చేరుకుంటుందని అధికారుల అంచనా. ఈ లెక్కన 2.50 లక్షల విత్తనాల సంచులు అవసరమవుతాయి. మార్కెట్‌లో బీటీ–1, బీటీ–2 పలు పత్తి విత్తన రకాలు అందుబాటులో ఉంటాయి. ఎక్కువ శాతం రైతులు బీటీ–2 రకానికి సంబంధించిన విత్తనాలకే ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం 450 గ్రాముల బీటీ–2 పత్తి విత్తనాల సంచి ధర రూ.864 ఉంది. వచ్చే సీజన్ నుంచి ఇది రూ.900 చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బీటీ రకాల్లో వందలాది కంపెనీలు ఉండటంలో డిమాండ్ ఉన్న రెండు, మూడు కంపెనీల విత్తనాలు మినహా ఇతర కంపెనీలు ప్రభుత్వం ప్రకటించిన ధరకు ఇస్తారు. డిమాండ్ ఉన్న విత్తనాలను ఎక్కువ ధరతో విక్రయిస్తారు. లేదంటే రైతుకు ఒకటి లేదా రెండు సంచులకు పరిమితం చేస్తారు. వివిధ కంపెనీలు పలు రకాల విత్తనాలను అందుబాటులో ఉంచినా.. రైతులు మాత్రం కొన్నింటికే మొగ్గుచూపడంతో ఏటా విత్తనాలకు రైతులు బారులుదీరి నిల్చోవాల్సి ఉంటుంది.