
యువత మత్తుకు బానిస కావొద్దు
● ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
ఏటూరునాగారం: డ్రగ్స్‌ని తరిమికొడదామని.. యువత మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల పరిధిలోని రామన్నగూడెంలో ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో డ్రగ్స్, ఫొక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. శిక్షణ పొందిన నార్కోటిక్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందాలు గ్రామంలో సోమవారం తనిఖీ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్‌కు బానిసలుగా మారితే విలువైన జీవితాలు ఆగం అవుతాయని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోకి అపరిచితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత చెడుమార్గంలో పయణించకుండా మంచి మార్గంవైపు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.