
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
తాత్కాలిక ట్రాఫిక్ స్టేషన్‌తో కొంత ఉపశమనం..
జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016 అక్టోబర్ 11న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పడింది. అప్పటినుంచి భూపాలపల్లి పట్టణం దినదినం అభివృద్ధి చెందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు, కేటీపీపీ, సింగరేణి పరిశ్రమలతో వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతుంది. బొగ్గు, ఇసుక లారీలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటమే కాక పలువురు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పలువురు యువకులు ట్రిబుల్ రైడింగ్‌తో వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. భూపాలపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యను గుర్తించిన ఎస్పీ కిరణ్ ఖరే గతేడాది ఫిబ్రవరిలో తాత్కాలిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే పలువురు సిబ్బంది, ఒక ఎస్సైని కేటాయించారు. వారి విధి నిర్వహణ మూలంగా కొంతమేరకు సమస్య పరిష్కారం అయినప్పటికీ పూర్తిస్థాయి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
ప్రతిపాదనలకే పరిమితం..
జిల్లా ఏర్పాటు సమయంలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆర్.భాస్కరన్ జిల్లాకేంద్రంలో ట్రాఫిక్, మహిళా పోలీస్‌స్టేషన్ అవసరాన్ని గుర్తించి స్టేషన్ల ఏర్పాటుకోసం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఇటీవల ప్రస్తుత జిల్లా ఎస్పీ కిరణ్‌ఖరే సైతం మరోమారు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ట్రాఫిక్, మహిళా పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటుచేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
పరిశీలనలో ఉంది..
జిల్లాకేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, మహిళా స్టేషన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం ఆ ఫైలు పరిశీలనలో ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే స్టేషన్లను ఏర్పాటు చేస్తాం.
– కిరణ్ ఖరే, ఎస్పీ
●
న్యూస్‌రీల్

బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025