
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
భూపాలపల్లి: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే ఈమేరకు వినతి పత్రం అందించారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గంలో నష్టపోయిన పంటల గురించి వివరించారు. మంగళవారం కురిసిన అకాల వర్షంతో వరి, మిర్చి, మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయని, అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ చేయించి, బాధిత రైతులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.
డిప్యూటీ సీఎంను కోరిన ఎమ్మెల్యే గండ్ర