బాలికల సంరక్షణకు చర్యలు
గద్వాల: బాలికల సంరక్షణకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. శనివారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల సంరక్షణకు సంబంధించిన శాఖలు కలిసి పనిచేయాలని అన్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి యోజన పథకం గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు నేరమని, ఎవరైన నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించడానికి అందరూ కూడ భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో సంక్షేమశాఖ జిల్లా అధికారి సునంద, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సరోజ, బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment