
లక్ష్యం.. శత శాతం
వివరాలు 8లో u
●
సకాలంలో బిల్లులు చెల్లించాలి
ఆస్తిపన్ను వసూళ్లు శతశాతం సాధించేలా తగిన ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి బిల్లులు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొండి బకాయిదారుల వివరాల జాబితాను రూపొందించేందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సకాలంలో బిల్లులు చెల్లించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
– నర్సింగరావు, అడిషనల్ కలెక్టర్
గద్వాలటౌన్: మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరు అయిన ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో పన్నులను నూరుశాతం వసూలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ దిశగా పూర్తి స్థాయిలో పన్నులను రాబట్టాలని అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొండి బకాయిదారుల వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. వీటిలో ప్రైవేటుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను చేర్చారు.
ప్రత్యేక కార్యాచరణ..
జిల్లాలో గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో వందశాతం పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార మాద్యమాలు, కరపత్రాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు లాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎక్కువ మొత్తం పన్నులు చెల్లించాల్సి ఉన్న బకాయిదారులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నా రు. పన్నుల వివరాలను గృహ యజమానుల సెల్‌ఫోన్‌లకు మెసేజ్ పంపేందుకు చర్యలు చేపట్టారు.
రాయితీలతో ఊరట
గత మూడేళ్లు ఆర్థిక సంవత్సరం మొదట్లో పన్ను వసూళ్లు పూర్తిగా మందగించాయి. దీంతో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఊరట కల్పించే విధంగా.. పన్ను చెల్లింపుదారులకు రాయితీ ప్రకటించింది. దీంతో చాలవరకు అప్పట్లో పన్నులు వసూళ్లు అయ్యాయి. గత ఏడాది ముందుస్తు పన్ను చెల్లింపుదారులకు 5 శాతం రాయితీ ఇచ్చింది. అదేవిధంగా మొండిబకాయిలపై 90 శాతం రాయితీ కల్పించింది. వీటి వలన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న చాలా వరకు మొండి బకాయిలు చాలావరకు వసూలయ్యాయి. ప్రభుత్వం కల్పించిన రాయితీలను సైతం ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎలాంటి రాయితీలు ప్రకటించలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని మున్సిపాలిటీలలో వంద శాతం పన్ను వసూలు చేసేలా ఇప్పటి నుంచే కసరత్తు చేపట్టారు.
జిల్లాలో ఆస్తిపన్ను వివరాలు...
మున్సిపాలిటీ అసెస్‌మెంట్లు లక్ష్యం వసూలు
(రూ.లలో) (రూ.లలో)
గద్వాల 15,865 7.13 కోట్లు 2.40 కోట్లు
అయిజ 8,065 1.72 కోట్లు 71 లక్షలు
అలంపూర్ 3,983 48.03 లక్షలు 23.60 లక్షలు
వడ్డేపల్లి 3,980 1.03 కోట్లు 68.06 లక్షలు
జిల్లాలో ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి
నాలుగు మున్సిపాలిటీలు.. రూ.10.36 కోట్లు దాటిన మొత్తం డిమాండ్
మొండి బకాయిదారుల జాబితా సిద్ధం

లక్ష్యం.. శత శాతం

లక్ష్యం.. శత శాతం
Comments
Please login to add a commentAdd a comment