![రైతుల సమస్యలు పరిష్కరిస్తాం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07alp03-210012_mr-1738954845-0.jpg.webp?itok=wU_kwHr8)
రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
అలంపూర్: కంది కొనగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన రాష్ట్ర ప్రధాన అధికారి రవిచంద్ర అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కంది కొనుగోళ్లను ఆయన, ఎన్‌సీపీఎఫ్ అధికారులు దువ్వా వినయ్, మహానామలు శుక్రవారం పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడి రోజువారిగా జరుగుతున్న కొనుగోళ్ల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడి కొనుగోళ్ల నేపథ్యంలో రైతులు ఎదుర్కొనే సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా ఎకరాకు 3.31 క్వింటాళ్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. నీటి లభ్యత భూసార ఆధారంగా రైతులకు ఎకరాకు 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు అధికారులకు వివరించారు. దీంతో ఎకరాకు 6 క్వింటాళ్ల చొప్పున కేంద్రాల్లో కొనుగోలు చేయాలని కోరగా.. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఎన్‌సీసీఎఫ్ అధికారి పేర్కొన్నారు. కేంద్రాల్లో విక్రయించాల్సిన రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా ఉండాలన్నారు. కేంద్రాలకు నాణ్యమైన కందులు తీసుకొస్తే రైతుల నుంచి ఎంత వచ్చిన కొనుగోలు చేస్తామన్నారు. క్వింటాకు రూ. 7550 మద్దతు ధర కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా మేనేజర్ గౌరి నాగేశ్వర్, పీఏసీఎస్ కార్యదర్శి కేశవరెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు. అనంతరం జోగుళాంబ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment