విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
ఎర్రవల్లి: విద్యార్థులు తోటి విద్యార్థులతో క్రమ శిక్షణతో మెలగాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్డి గంటా కవితా అన్నారు. శుక్రవారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆశయంతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశలోనే చాలా మంది చెడు వ్యసనాల బారిన పడి నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇష్టంతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రుతకు మంచి పేరును తీసుకు రావాలని ఆమె సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వంట వారికి, పాఠశాల సిబ్బందికి పరిశుభ్రత, మెనూ గురించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాద్యాయులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment