వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
ఇటిక్యాల: వైద్య సిబ్బంది విధిగా సమయపాలన పాటించి రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ సిద్దప్ప అన్నారు. శుక్రవారం ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులను పరిశీలించి రోగులకు అందిస్తున్న వివిధ సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో డెలివరీల సంఖ్య పెంచాలని సూచించారు. టీబీ మరియు లిప్రసి వ్యాధులను గుర్తించి వెంటనే వారికి సరైన చికిత్స అందించాలని సూచించారు. ఈ నెల 10న జరిగే నులి పురుగుల దినోత్సవ కార్యక్రమంలో 1–19 సంవత్సరాలలోని చిన్నారులకు మాత్రలు వేసి 100శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆరోగ్యకేంద్రంలోని ల్యాబ్, డెలివరి గదులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఓ తిరుమల్‌రెడ్డి, హెచ్‌ఈ మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ రాధిక, ఎంఓలు సత్యమ్మ, వెంకటేశ్వర్లు, హెచ్‌ఎస్ పరశురాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment