![గజవాహనంపైఊరేగిన వేంకటేశ్వరస్వామి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/4_mr-1739042143-0.jpg.webp?itok=1EnLEfux)
గజవాహనంపైఊరేగిన వేంకటేశ్వరస్వామి
మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారికి గజవాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పూలతో శోభాయమానంగా అలంకరించిన గజవాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారిని గర్భగుడిలోకి తీసుకెళ్లి అభిషేకాలు, అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. – మహబూబ్‌నగర్ రూరల్
Comments
Please login to add a commentAdd a comment