పప్పుశనగ అమ్మేదెట్లా?
నేటికీ ఏర్పాటుచేయని కొనుగోలు కేంద్రాలు
●
మద్దతు ధరతో
కొనుగోలు చేయాలి
ఈ ఏడాది 6 ఎకరాల్లో పప్పుశనగ పంట సాగు చేశాను. ప్రస్తుతం కోతలు జరుగుతున్నా యి. మరో మూడు రోజుల్లో నూర్పిళ్లు చేసి ధాన్యం సిద్ధం చేసుకుంటాం. ఇప్పటికే కోత కోసిన వారు పంట విక్రయించడానికి మద్దతు కేంద్రాలు లేకపోవడంతో బహిరంగ మార్కెట్‌లకు తరలిస్తున్నారు. కానీ అక్కడ ఆశించిన మేరకు మద్దతు ధర లభించడం లేదు. ధాన్యం వచ్చిన తర్వాత మా పరిస్థితి అదేవిధంగా ఉంటుందని భయంగా ఉంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలి. – బాబురెడ్డి,
సాసనూలు గ్రామం, ఎర్రవల్లి మండలం
ప్రోత్సాహకం అందిస్తున్నాం
పప్పుశనగ పంట సాగుకు రైతులకు ప్రొత్సాహకం అందిస్తున్నాం. ఈ ఏడాది అలంపూర్ మండలంలో 125 మంది రైతులకు వంద శాతం సబ్సిడీపై విత్తనాలు అందించాం. ప్రస్తుతం పంట కోత దశకు చేరింది. త్వరలో ధాన్యం చేతికి అందుతుంది.
– నాగార్జున్ రెడ్డి, ఏఓ, అలంపూర్
త్వరలో అనుమతులు..
పప్పుశనగ కొనుగోలు కేంద్రాలు త్వరలో అందబాటులోకి వస్తాయి. పంట సాగు ఆధారంగా కొనుగోలు కేంద్రాల కోసం ప్రతిపాదనలు చేశాం. వారం రోజుల్లో కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పప్పుశనగ కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5650గా ఉంది. అనుమతులు వస్తే ఆ మేరకు కొనుగోలు చేస్తాం.
– గౌరినాగేశ్వర్, మార్క్‌ఫెడ్ డీఎం
అలంపూర్: ఓ వైపు దిగుబడి తగ్గడం.. మరో వైపు మ ద్దతు ధర దక్కకపోవడంతో పప్పుశనగ సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ప్రభు త్వ కొనుగోలు కేంద్రాలు కనిపించకపోవడంతో బహిరంగ మార్కెట్‌లోనే దళారులకు విక్రయించి నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈ ఏడాది ప ప్పుశనగ పంట 20442 ఎకరాల్లో సాగు చేశారు. గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం కొంత పెరిగింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో అధిక మంది రైతులు పప్పుశనగ సాగుపై దృష్టిసారించారు. అత్యధికంగా అలంపూర్ మండలంలో 6,668 ఎకరాలు, ఉండవెల్లిలో 5273, ఇటిక్యాలలో 2419, మానవపాడులో 1609, వడ్డేపల్లిలో 1,598, రాజోలిలో 813, అయిజలో 775, మల్దకల్‌లో 693, గద్వాలలో 581 ఎకరాల్లో పంట సాగు చేశారు.
దిగుబడి తగ్గడంతో దిగాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పప్పుదినుసుల పంట సాగును ప్రొత్సహించడానికి జాతీయ ఆహార భద్రత పథకం కింద కొత్త రకం విత్తనాలు వంద శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. అందులో పప్పుశనగ పంట సైతం ఒకటిగా ఉంది. కానీ దిగుబడి తగ్గుతుండటంతో రైతులు పప్పుశనగ సాగుపై ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఏటికేడు పప్పుశనగ సాగు తగ్గుతుంది. గతంలో పప్పుశనగ సాగు చేసిన రైతులకు ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. కానీ ప్రస్తుతం 3 నుంచి 5 క్వింటాళ్లకి మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు.
కేంద్రాలు లేక బహిరంగ
మార్కెట్‌కు..
ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పప్పుశనగ పంటను రైతులు బహిరంగ మార్కెట్‌లో దళారులకు విక్రయించి నష్టాలు చవిచూస్తున్నారు. పప్పుశనగ కొనుగోలు చేయడానికి మార్క్‌ఫెడ్ సంస్థ ప్రతిపాదనలు చేసింది. కానీ ఇప్పటివరకు ఉన్నతాధికారుల నుంచి కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు అందలేదు. దీంతో ఇప్పటికే కోత కోసిన రైతులు బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5650 ఉంది. కానీ బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్ రూ.5వేలు పలుకుతోంది. దీంతో ఎకరాకు దాదాపు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేసి పంట సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర లభించక నష్టపోతున్నారు.
విధిలేక ఏపీ, కర్ణాటకకుతరలిస్తున్న రైతులు
తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్న వైనం
ఇటు దిగుబడి రాక, మద్దతు ధర అందక వెంటాడుతున్న కష్టాలు
జిల్లాలో 20,442 ఎకరాల్లో పప్పుశనగ సాగు
పప్పుశనగ అమ్మేదెట్లా?
పప్పుశనగ అమ్మేదెట్లా?
పప్పుశనగ అమ్మేదెట్లా?
పప్పుశనగ అమ్మేదెట్లా?
Comments
Please login to add a commentAdd a comment