‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
గట్టు: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా హెచ్‌ఎంలు కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. గురువారం గట్టులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నియోజకవర్గ ఎంఈఓలు, హెచ్‌ఎంలతో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, డీఈఓ అబ్దుల్‌ఘనీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణను సాధించే విధంగా ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలన్నారు. గత ఏడాది ఫలితాల్లో జిల్లా 32వ స్థానంలో ఉందని, ఈసారి మెరుగైన స్థానం సంపాదించుకుందామని తెలిపారు. గట్టు, కేటిదొడ్డి మండలాలు వెనుకబాటుతనపు బావాన్ని తొలగించుకుని, పదిలో మంచి ర్యాంకులను సాధించాలని, అక్షరాస్యత శాతం పెంచాలని, విద్యా ప్రమాణాలను మెరుగు పరచాలని ఆదేశించారు. నెలరోజుల సమయం ఉందని, విధిగా పాఠశాలకు హాజరు అయ్యేలా చూడాలని, ప్రత్యేక ప్రిపరేషన్ తరగతులు నిర్వహించాలని, గతేడాది ప్రశ్నాపత్రాలను అధ్యయనం చేయించాలని, 10కి 10 జీపీఏ సాధించేలా తర్ఫీదు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గోవిందయ్య, షకీలాభాను, సంగీతలక్ష్మీ,వెంకటేశ్వర్లు,ప్రియాంక, అక్బర్‌బా ష, ఎంపీడీఓ చెన్నయ్య పాల్గొన్నారు.
విద్యార్థులకు పోషకాహారాన్ని అందించాలి
విద్యార్థులకు పోషకాలు కల్గిన సముతల ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ గురుకుల సిబ్బందిని ఆదేశించారు. గురువారం గట్టులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలోని గదులు, వంట గది, పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. మెనూ పాటించాలని, వంట పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, తాజా కూరగాయాలు వాడాలని వంట ఏజెన్సీ సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకు ముందు గట్టులోని జాతీయ గ్రామీణ ఉపాధి కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కూలీలు అందరికి పని కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామంలో ఉపాధి పనులు ప్రారంభించాలని, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి జాబ్ కార్డును అందించాలని, పనుల్లో అవకతవకలకు అవకాశం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి
కలెక్టర్ బీఎం సంతోష్
Comments
Please login to add a commentAdd a comment