పెద్దకొత్తపల్లి: డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసి వారు ఆన్‌లైన్‌లో నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌లో పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. విపత్తుల నిర్వహణ అంశంపై విద్యార్థులు గాధరి ప్రవీణ్, సాయిచరణ్ రూపొందించిన నోకాస్ట్ లైఫ్ సేవింగ్ బోటు అనే ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికై ందని హెచ్‌ఎం సురేఖ తెలిపారు. వరద బాధితుల ప్రాణాలను రక్షించేందుకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం గురుకాసి యూనివర్సిటీ వారు అవసరమైన నిధులను అందజేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయస్థాయికి ఎంపికై న విద్యార్థులతో పాటు గైడ్ టీచర్ శైలజ, విద్యార్థుల తల్లిదండ్రులకు డీఈఓ రమేష్ కుమార్ అభినందనలు తెలిపారు.
ముష్టిపల్లి విద్యార్థులు తయారుచేసిన నీటి పడవ
Comments
Please login to add a commentAdd a comment