ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
గద్వాల: ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గత అనుభావాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 8341 విద్యార్థులు పరీక్ష రాసేందుకు 14పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ముందస్తుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా 144సెక్షన్ అమలు చేయనున్నందున అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సెల్‌ఫోన్లు, వాచ్‌లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకురావటానికి అనుమతి లేదన్నారు. విద్యార్థులకు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో వైద్యశిభిరం, నిరంతరం విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యం, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఎస్పీ మొగులయ్య, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి హృదయరాజు, డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప, ఆర్టీసీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బడి మానేసిన విద్యార్థులను తిరిగి చేర్పించాలి
పదో తరగతి మధ్యలో బడి మానేసిన విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాయంలో అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం బాలకార్మికుల పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుని సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఆపరేషన్ స్మైల్‌ను మరింత పకడ్బందీగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 18సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని వెట్టిచేయించుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, డీఎస్పీ మొగులయ్య, డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్ధప్ప, ఆర్డీవో శ్రీనివాస్‌రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
వేసవిలో విద్యుత్ సమస్యలు రానివ్వొద్దు
రబీ సీజన్‌లో సాగుచేసిన వివిధ రకాల పంటలకు, రానున్న వేసవిలో విద్యుత్తు అంతరాయం తలెత్తకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా కొనసాగించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. శుక్రవారం జూరాల జనరేషన్ ప్లాంట్, 220/132 కేవీ జూరాల సబ్‌స్టేషన్, 132/33 కేవి, 33/11 కేవీ గద్వాల సబ్‌స్టేషన్, మానిటరింగ్ సెల్‌లను అకస్మికంగా తనఖీ చేసి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈసందర్భంగా విద్యుత్తు సరఫరా, నిర్వహణ, డిమాండ్ అంశాలపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వ్యవసాయం, గృహాలు, ఆసుపత్రులు, పరిశ్రమలకు డిమాండ్ మేర నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలన్నారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ తిరుపతిరావు, ఏడీ రమేష్‌బాబు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
అన్ని పరీక్షా కేంద్రాలలోసీసీ కెమెరాలు తప్పనిసరి
కలెక్టర్ బీఎం సంతోష్
Comments
Please login to add a commentAdd a comment