చదువుతోపాటు ఆరోగ్యం ముఖ్యం
గట్టు: విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇక నుంచి రాగి చిక్కిని కలెక్టర్ ఆదేశాల మేరకు అందిస్తున్నట్లు డీఈఓ అబ్దుల్ గని తెలిపారు. ఇన్‌స్పైర్, అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థల సహకారంతో శుక్రవారం గట్టు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రాగి చిక్కి పంపిణీ కార్యక్రమాన్ని డీఈఓ, ఎంఈఓ నల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు ఈ రాగి చిక్కిని అందించనున్నట్లు డీఈఓ తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 100 శాతం ఫలితాలను తీసుకువచ్చేలా ఉపాధ్యాయులు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలని, విద్యార్థులు కూడా క్రమం తప్పక పాఠశాలకు హాజరు కావాలని సూచించారు. మరో నెలరోజుల్లో వార్షిక పరీక్షలున్నాయని, నెల రోజులు ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థులను సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌స్పైర్ కోఆర్డినేటర్ ఇనాయిస్, అన్నపూర్ణ కోఆర్డీనేటర్‌సందీప్, ఎంపీడీఓ చెన్నయ్య, అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీ చైర్మన్ సత్యకళ, తప్పెట్లమొర్సు హెడ్మాస్టర్ ఆగస్టిన్ తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,019
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు శుక్రవారం 366 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.7019, కనిష్టం రూ.3500, సరాసరి రూ.5729 ధరలు పలికాయి. అలాగే, 125 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.7089, కనిష్టం రూ. 2689, సరాసరి రూ.5689 ధరలు వచ్చాయి.
మంత్రుల పర్యటనకుపటిష్ట ఏర్పాట్లు
కొత్తకోట రూరల్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం జిల్లాకు రానున్నారని.. పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్‌పాం ఫ్యాక్టరీకి మంత్రులు భూమిపూజ చేయనున్నందున శుక్రవారం ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించి మాట్లాడారు. కార్యక్రమ స్థలంలో జిల్లా ఉద్యాన, వ్యవసాయశాఖకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఆయిల్‌పాం సాగుచేస్తున్న ముగ్గురు ఆదర్శ రైతులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. వచ్చిన వారికి ఆహారం అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసుశాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి వచ్చే ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సభాస్థలిని పరిశీలించిన ఎస్పీ..
మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ శంకుస్థాపనకు శనివారం రాష్ట్ర మంత్రులు రానున్న సందర్భంగా శుక్రవారం భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షించారు. సభాస్థలి, వాహనాల పార్కింగ్ స్థలాలు, బందోబస్తు ఏర్పాట్ల తీరును పరిశీలించారు. బందోబస్తులో పాల్గొనే పోలీసు అధికారులకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన భద్రతపై పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని, విధులను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, కొత్తకోట ఎస్‌ఐ ఆనంద్ తదితరులు ఉన్నారు.
చదువుతోపాటు ఆరోగ్యం ముఖ్యం
Comments
Please login to add a commentAdd a comment