హోరాహోరీగా జాతీయ స్థాయి కుస్తీ పోటీలు
అయిజ: తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన జాతీయ స్థాయి కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ రాష్ట్రాలనుంచి మొత్తం 25 మంది మల్లయోధులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాగిన కుస్తీపోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. అనంతరం కర్ణాటక రాష్ట్రం విజయపురం జిల్లా చడ్చల్ గ్రామానికి చెందిన రామచంద్ర ప్రథమ బహుమతి, రంగారెడ్డికి జిల్లాకు చెందిన పీఎస్ సింగ్ ద్వితీయ, కర్ణాటక రాష్ట్రం విజయపూర్ జిల్లా చడ్చల్‌కు చెందిన కామన్న తృతీయ, హైదరాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్ నాల్గో స్థానాల్లో నిలిచారు. వరుసగా రూ.50వేలు, రూ.25వేలు, రూ.15వేలు, రూ.7వేలు గెలుపొందారు. రాత్రి ఆలయ కమిటి సభ్యులు విజేతలకు బహుమతులు అందజేశారు.
అంతరాష్ట్ర భజన పోటీలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఆలయంలో అంతరాష్ట్ర భజన పోటీలు నిర్వహించారు. అనంతపురం జిల్లా నారపాలకు చెందిన మూల పెద్దమ్మ భజన మండలి ప్రథమ బహుమతి రూ.20,016ను కై వసం చేసుకుంది. నంద్యాల జిల్లా మండవాని పల్లికి చెందిన సాయి వీరాంజనేయస్వామి భజన మండలి ద్వితీయ బహుమతి రూ.15,016, గద్వాల జిల్లా పర్దిపురంకు చెందిన మల్లికార్జున భజన మండలి మూడవ బహుమతి రూ.10,016 నగదు బహుమతిని గెలుచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment