సేవాలాల్ మార్గం అనుసరణీయం
గద్వాలటౌన్ : సంత్ సేవాలాల్ సమాజానికి చేసిన సేవలు మరిచిపోలేనివని, ఆయన మార్గం అనుసరణీయమని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు సేవాలాల్ చిత్రపటంతో పట్టణంలో గిరిజన సంఘం నాయకులు, విద్యార్థులు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప విప్లవ చైతన్య మూర్తి సంత్ సేవాలాల్ అని కొనియాడారు. దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో ఒకరని పేర్కొన్నారు. సేవాలాల్ మహరాజ్ తన బోధనల వల్ల బంజారా జాతి పురోగమించడానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. బంజారా సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరుపున మరింత కృషి చేస్తానన్నారు. గిరిజన కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ బంజారాల జీవనం ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. విద్యలో మరింత వృద్ధి సాధించాలని సూచించారు. సేవాలాల్ చూపిన మార్గంలో పయణించి సన్మార్గంలో ఉండాలని సూచించారు. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను అందిపుచ్చుకొని మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సేవాలాల్ సేనా నాయకులు రవినాయక్, కృష్ణనాయక్, సురేష్ నాయక్, శ్రీనునాయక్, రూప్లానాయక్, నర్సింహులు నాయక్, ఉద్యోగ సంఘం నాయకులు మునెప్పనాయక్, జయరాం నాయక్, సరోజమ్మ, శంకర్ నాయక్, హనుమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment