మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
అలంపూర్ రూరల్: జిల్లాలో పండిన ఎండుమిర్చి పంటను రాష్ట్ర ప్రభుత్వం మిర్చి బోర్డు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జి.కే ఈదన్న డిమాండ్ చేశారు. అలంపూర్ మండలంలోని క్యాతూర్‌లో రైతులతో కలిసి ఆయన మిర్చి పంటను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎండు మిర్చి పంట నిల్వ చేసుకోవడానికి గోదాములు, స్థానికంగా విక్రయించేందుకు మార్కెట్ సదుపాయం లేక సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తోందని, అయినా కూడా సరైన ధర రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. పసుపు బోర్డు మాదిరిగా.. ఎండుమిర్చికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి నేరుగా ఎండు మిర్చిని క్వింటాల్‌కు రూ.25 వేలు ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. నాయకులు బంగారు రఫీ, గణేష్, రాఘవరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment