రక్తదానం ప్రాణదానంతో సమానం
శాంతినగర్: రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణం పోసినట్లేనని స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ రామా ఓబులేష్ అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది సహకారంతో డిగ్రీ కళాశాలలో గురువారం రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ రక్తదానం ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. రక్తదానం ప్రాణదానంగా బావించి ఎంతో మంది విద్యార్థులు, అధ్యాపకులు ముందుకువచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
పీఎఫ్ బకాయిలు
విడుదల చేయాలి
గద్వాలటౌన్: మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు పది నెలలుగా పీఎఫ్, ఈఎస్‌ఐ బకాయి ఉన్నాయని, తక్షణమే వాటిని విడుదల చేసి కార్మికుల ఖాతాలో జమ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు చెందిన పీఎఫ్, ఈఎస్‌ఐ బకాయిలను చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు సైతం నెలనెల చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఉప్పేర్ నర్సింహా, శివ, రవి, మహేష్, రఘు, హనుమంతు పాల్గొన్నారు.
సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణం.
తేరుమైదానం నుంచి పెద్ద ఆగ్రహారంకు వెళ్లే మార్గంలో నిబంధనలు ఉల్లంఘించి ఓ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు కాలనీ వాసులతో కలిసి కమిషనర్ పిర్యాదు చేశారు. సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణ పనులు చేపట్టారన్నారు. రోడ్డు, డ్రైనేజీలు సైతం ఆక్రమణకు గురువుతున్నాయిన చెప్పా రు. ఈ నిర్మాణం వలన ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మీ ఎమ్మెల్యేలు జారకుండా చూసుకోండి
● ఎంపీ బండి సంజయ్‌కుఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సూచన
జడ్చర్ల: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన ఆరోపణలు అర్ధరహితమని, ముందుగా మీ పార్టీ ఎమ్మెల్యేలు జారకుండా చూసుకోండి అని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఉదండాపూర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు అధ్యక్ష పదవిని కోల్పోయిన బండి సంజయ్ సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడేందుకు ఆయన ఎవరు అని ఎదురు ప్రశ్నించారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించేందుకు పోరాడాలని హితవు పలికారు. పక్క రాష్ట్రం ఏపీలో బీజేపీ ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్నా నిధులు తెచ్చుకుంటుంటే 8 మంది ఎంపీలు ఉండి ఇక్కడేమో చోద్యం చూస్తున్నారని, కేంద్రంతో నిధుల కోసం కొట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు బీటీంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని, సీఎం రేవంత్‌రెడ్డి మరో పదేళ్లు అధికారంలో ఉండటం ఖాయమన్నారు. సీఎంగా రేవంత్‌రెడ్డి ఉంటే మీకేం ఇబ్బంది అన్నారు. బీజేపీ ధ్యాసంతా ప్రభుత్వాలు కూల్చడంపైనే ఉందని మండిపడ్డారు. రాజధాని నడిబొడ్డున ఓ హోటల్‌లో తాము నియోజకవర్గాలకు సంబంధించిన నిధుల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని స్పష్టం చేశారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం
Comments
Please login to add a commentAdd a comment