స్టేషన్ మహబూబ్‌నగర్: అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు ఈ నెల 12న రాత్రి 7 గంటలకు మహబూబ్‌నగర్ బస్టాండ్ నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ కాణిపాకం విఘ్నేశ్వరుడు, 13న సాయంత్రం 6 గంటలకు అరుణాచలంకు చేరుకుంటుందని పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి బయలుదేరుతుందని పేర్కొన్నారు. tgsrtcbus.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9959226286 సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment