రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు డిగ్రీ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు డిగ్రీ విద్యార్థులు

Published Tue, Mar 4 2025 12:28 AM | Last Updated on Tue, Mar 4 2025 12:29 AM

రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు డిగ్రీ విద్యార్థులు

రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు డిగ్రీ విద్యార్థులు

గద్వాలటౌన్‌: కళాశాల విద్యాశాఖ ఏటా జిజ్ఞాస పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయడం, సృజనాత్మకత ఆలోచనలకు పదును పెట్టించడమే ఈ పోటీల లక్ష్యం. ఈ సంవత్సరం స్థానిక ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి నాలుగు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపికయ్యాయి. గణితం, ఫిజిక్స్‌, మైక్రోబయాలజీ, ఆంగ్లం సబ్జెక్టుల నుంచి ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఎంపికై న ఆయా సబ్జెక్టులకు ఆధ్యాపకులు సత్యన్న, రాధిక, నవిత, మల్లికార్జున్‌ సూపర్‌వైజర్లుగా వ్యవహరిస్తారు. ఒక్కో ప్రాజెక్టుకు బృందంలో 4–6 మంది విద్యార్థులు ఉంటారు. ఈ నెల 4వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని నాంపల్లి ఉమెన్స్‌ కళాశాలలో జరిగే రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలలో విద్యార్థులు పాల్గొని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రదర్శన ఇవ్వనున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్‌ షేక్‌ కలందర్‌బాషా అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement