కలిసికట్టుగా గ్రామాభివృద్ధి చేసుకోవాలి
ధరూరు: ప్రతి గ్రామంలో బడి, గుడి అనేవి తప్పకుండా ఉండాలని, ఆలయాలతో ప్రజల్లో భక్తి భావం పెరిగి శాంతి పెంపొందుతుందని, గ్రామస్తులంతా కలిసికట్టుగా గ్రామాభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఖమ్మంపాడులో నూతన ఆలయాల ప్రారంభోత్సవంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామస్తులు ఇటీవల నిర్మించుకున్న శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాలను పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం ఎమ్మెల్యే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో పాడి పంటలు సమృద్దిగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, డీఆర్ విజయ్‌కుమార్, రఘువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment