ఎట్టకేలకు..!
●
మార్గదర్శకాలకు
అనుగుణంగా చర్యలు
ఎల్‌ఆర్‌ఎస్ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అయితే క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. తాజాగా క్రమబద్ధీకరణపై ప్రభుత్వం 25 శాతం రాయితీ ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి క్రమబద్దీకరిస్తాం. నిబంధనల మేరకు దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరిస్తాం.
– దశరథ్, కమిషనర్, గద్వాల
25 శాతం రాయితీపై ఆశలు
ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. ఫీజులో రాయితీతో పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి వన్‌టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) విధానం అమలు చేసి 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ప్లాట్‌కు విస్తీర్ణం బట్టి సుమారు రూ.10 వేల నుంచి రూ.30 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సుమారు రూ. 30–40 కోట్ల వరకు ఆదాయం సమకూరనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై రాయితీ ప్రకటన నేపథ్యంలో చాలామంది ముందుకొచ్చి క్రమబద్దీకరించుకునే అవకాశం ఉంది.
గద్వాల టౌన్: పెండింగ్‌లోని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, మార్చి 31వ తేదీలోపు క్రమబద్దీకరణ చేయించుకున్న వారికి ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొనడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇదిలాఉండగా, అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు గత ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్) పథకాన్ని ప్రకటించింది. మున్సిపాలిటీ పరిఽధిలో 2020 ఆగస్టు 26వ తేదీ వరకు రిజిస్టర్ అయిన అనధికార ప్లాట్లు, లేఅవుట్లను మాత్రమే క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులు స్వీకరించగా జిల్లాలో భారీ స్పందన లభించింది. అనంతరం దరఖాస్తుల పరిశీలనను వెంటనే ప్రారంభించాలని సూచించిన సర్కార్ తర్వాత నిలిపివేసింది. ఆన్‌లైన్‌లో లాగిన్ లేకపోవడంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ అప్పట్లో ముందుకు సాగలేదు. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. గత మూడేళ్ల కాలంగా పెండింగ్‌లో ఉండడంతో దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత డిసెంబర్‌లో ప్లాట్ల క్రమబద్ధీకరణకు అడుగులు పడ్డాయి. అయితే శాఖల మధ్య సమన్వయం లోపం కారణంగా ఈ ప్రక్రియ నత్తనడకన సాగింది. ఇంతలోనే కులగణన, ఇందిరమ్మ ఇళ్లు తదితర వాటిపై సర్వే జరగడంతో సిబ్బంది అంతా అందులోనే నిమగ్నమయ్యారు. ఎల్‌ఆర్‌ఎస్ నిలిచిపోయింది. ఇన్నాళ్లకు ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తామని సీఎం పేర్కొనడంతో కదలిక వచ్చినట్లయ్యింది.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలిలా..
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు
పరిష్కరిస్తామని సీఎం ప్రకటన
ఆశావహుల్లో ఆనందం
నాలుగు మున్సిపాలిటీల్లో వచ్చిన దరఖాస్తులు 28,663
25 శాతం రాయితీపై
చిగురిస్తున్న ఆశలు
ఎట్టకేలకు..!
Comments
Please login to add a commentAdd a comment