ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి
కేటీదొడ్డి: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక సూచించారు. సోమవారం మండలంలోని చింతలకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. బాలబాలికలు పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించా లని సూచించారు. బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్యవివాహాలతో కలిగే నష్టాలను వివరించారు. ఎవరైనా బాలబాలికలపై వేధింపులకు పాల్పడితే డయల్ 100 లేదా 1098 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీఓ నర్సింహులు, ఐసీపీఎస్ సోషల్ వర్కర్ పద్మ, హెచ్‌ఎం భాస్కర్ పాల్గొన్నారు.
పథకాల అమలులో నిర్లక్ష్యం తగదు
అలంపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించడం తగదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంవీ రమణ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వరిధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో రూ. 500 బోనస్ ఎందుకు జమ చేయడం లేదని ప్రశ్నించారు. రైతులు పండించిన మిర్చి, పప్పుశనగ, మిర్చి, పొగాకు పంటలకు మద్ధతు ధర లేక పొలాల్లోనే ఉన్నాయన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినా పట్టడం లేదన్నారు. ఆర్థిక పరిస్థితి పేరుతో సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే ప్రారంభించి.. కూలీలకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, మాట్లాడుతూ.. అలంపూర్ చౌరస్తాలో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. 20వేల ఎకరాల్లో పప్పుశనగ పండించిన రైతులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన కందులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీల్లో పేదలకు ఇళ్ల స్థలాలు లేక అల్లాడుతుండగా.. అధికారుల అండదండలతో ప్రభుత్వ భూములు, 10 శాతం స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం నాయకులు నర్మద, జి.రాజు, పరంజ్యోతి, జీకే ఈదన్న, ఉప్పేర్ నర్సింహ్మ, రమేష్, మద్దిలేటి ఉన్నారు.
ఆర్డీఎస్ రైతులకు సహకారం అందించండి
అలంపూర్: ఆర్డీఎస్ ఆయకటు ్ట రైతులకు ఏపీ ప్రభుత్వపరంగా సహకారం అందించాలని కర్నూలు జిల్లా నీటిపారుదలశాఖ ఎస్‌ఈ ద్వారకనాథ్‌రెడ్డిని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కోరారు. కర్నూలులోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే ఎస్‌ఈని కలిసి పలు సమస్యలపై చర్చించారు. ప్రధానంగా కేసీ కెనాల్‌కు రెండు రోజులపాటు నీటిని నిలిపివేయాలని.. తద్వారా తుమ్మిళ్ల ద్వారా ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు కొంత మేరకు సాగునీటిని అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. టీబీ డ్యాం నుంచి ప్రస్తుతం 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండగా.. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి కాకుండా నేరుగా కేసీ కెనాల్‌కు నీరు చేరుకుంటున్నట్లు వివరించారు. దీంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందడం లేదని తెలిపారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఎస్‌ఈ.. తక్షణమే 250 క్యూసెక్కుల నీటిని కేసీ కెనాల్‌కు తగ్గించినట్లు పేర్కొన్నారు. మంగళ, బుధవారాల్లోనూ కేసీ కెనాల్‌కు నీటిని నిలిపివేస్తామని చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి
ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment